News3rd Jul 03:44 PMSunil Byrisetty1 min read

పెండింగ్ కేసుల పరిష్కారానికి మీడియేషన్ ఫర్ ద నేషన్ క్యాంఫైన్

దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాలనే లక్ష్యంతో సుప్రీం కోర్టు మీడియేషన్, కన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ పని చేస్తోందని ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవాధికార సంస్థ మె

పెండింగ్ కేసుల పరిష్కారానికి మీడియేషన్ ఫర్ ద నేషన్ క్యాంఫైన్
దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాలనే లక్ష్యంతో సుప్రీం కోర్టు మీడియేషన్, కన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ పని చేస్తోందని ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ (డిస్ట్రిక్టు అండ్ సెషన్స్ జడ్జి) బి.ఎస్.వి.హిమబిందు తెలిపారు. ఈ నెల 1 నుంచి 90 రోజుల పాటు నిర్వహిస్తున్న దేశవ్యాప్త మధ్యవర్తిత్వ క్యాంఫైన్‌ను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సివిల్ కేసులు, కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, ప్రీ-లిటిగేషన్ కేసులను పరిష్కరించేందుకు ఈ నెల 5వ తేదీన నిర్వహించే 2 వ జాతీయ లోక్ అథాలత్ ను కూడా సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. సచివాలయం దగ్గర్లోనున్న రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ మీడియేషన్ ఫర్ ద నేషన్ క్యాంఫైన్, లోక్ అదాలత్ ద్వారా కేసులను రాజీచేసుకుంటే ఇరుపక్షాలు విజయం సాధించినట్లే అన్నారు.
pan India
Mediation For Nation camping
Pending Cases Across Nation
High court
District courts
B.S.V. Himabindu
pre-litigation cases
criminal cases
Scroll for the next article