News23rd Dec 04:20 PMSunil Byrisetty1 min read
పిపిపి విధానంతోనే మెడికల్ కాలేజీలు, హాస్పటల్స్ అభివృద్ది సాధ్యం
ముఖ్యమంత్రి చంద్రబాబు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఇండియాలోనే బెస్ట్ పాలసీ పీపీపీ విధానం రాష్ట్రానికి తీసుకురావటం జరిగింది. జాతీయ వైద్య కమిషన్ (NMC
ముఖ్యమంత్రి చంద్రబాబు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఇండియాలోనే బెస్ట్ పాలసీ పీపీపీ విధానం రాష్ట్రానికి తీసుకురావటం జరిగింది. జాతీయ వైద్య కమిషన్ (NMC), ఆరోగ్య స్థాయి సంఘం సూచించిన పీపీపీ విధానంతోనే మెడికల్ కాలేజీలు, హాస్పటల్స్ అభివృద్ది సాధ్యమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. సిద్దార్ధ ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్ధినులకు, సీనియర్ రెసిడెంట్ మహిళా డాక్టర్లకు నిర్మించిన హాస్టల్ భవనం ప్రారంభోత్సవం కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి గా హాజరైన రాష్ట్ర ఆరోగ్య, వైద్య శాఖ మంత్రి కె.సత్య కుమార్ యాదవ్ తో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, యార్లగడ్డ వెంకట్రావు, కలెక్టర్ లక్ష్మీశా ఈ హాస్టల్ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం హాస్టల్ మొత్తం తిరిగి పరిశీలించారు.
ఈ సందర్బంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఈ హాస్టల్ భవన నిర్మాణానికి 2017 లో రూ.21 కోట్ల నిధులతో శంకుస్థాపన జరిగి పనులు ప్రారంభం కాగా, 2019 తర్వాత గత ప్రభుత్వం ఈ భవన నిర్మాణానికి నిధులతో పాటు, పనులు కూడా నిలిపివేసిందన్నారు.