News19th Jan 03:36 PMSunil Byrisetty1 min read

20 ఏళ్ల తర్వాత వైద్య మండలి సభ్యుల ఎన్నిక

రాష్ట్ర వైద్య మండలి (ఏపీ మెడికల్ కౌన్సెల్) సభ్యుల ఎంపిక కోసం వచ్చేనెల 9న ఆన్లైన్ ద్వారా ఎన్నికలను నిర్వహించనున్నట్లు డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ చక్రధరబా

20 ఏళ్ల తర్వాత వైద్య మండలి సభ్యుల ఎన్నిక
రాష్ట్ర వైద్య మండలి (ఏపీ మెడికల్ కౌన్సెల్) సభ్యుల ఎంపిక కోసం వచ్చేనెల 9న ఆన్లైన్ ద్వారా ఎన్నికలను నిర్వహించనున్నట్లు డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ చక్రధరబాబు వెల్లడించారు. మండలి చట్టంలో సెక్షన్ 3 (2) (బి) కింద నిర్దేశించిన 13 మంది సభ్యుల ఎంపిక కోసం ఎన్నికల నోటిఫికేషన్ను జారీచేసినట్లు పేర్కొన్నారు. తాడేపల్లిలోని DSH ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో రిటర్నింగ్ ఆఫీసర్ చక్రధరబాబు మాట్లాడారు. హైకోర్టు ఆదేశాలు అనుసరించి వైద్య మండలిలో సభ్యుల ఎంపిక కోసం ఎన్నికలు నిర్వహించబోతున్నామని చెప్పారు. చివరిగా ఎన్నికలు 2006లో జరిగాయన్నారు. 55,504 మంది వైద్యులకు ఓటు హక్కు ఉందని తెలిపారు. అర్హత కలిగిన వైద్యులు ఎక్కడ్నుంచైనా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం ఉందని, ఇందుకు మొబైలు సైతం ఉపయోగించుకోవచ్చునని పేర్కొన్నారు.
AP Medical Council
Medical Council Elections
Online Voting
Andhra Pradesh Health Department
Director of Secondary Health
రిటర్నింగ్ ఆఫీసర్ చక్రధరబాబు
హైకోర్టు ఆదేశాలు
వైద్యుల ఓటింగ్
Scroll for the next article