News10th Sep 05:15 PMSunil Byrisetty1 min read

హజ్ యాత్రికులకు వైద్య పరీక్షల కోసం ఏర్పాట్లు

పవిత్ర హజ్ యాత్ర-2027(1448-హెచ్)కు దరఖాస్తు చేసుకొని ఎంపికైన హాజీలకు రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య, శారీరక దృఢత్వ ధ్రువీకరణ పత్రాలను జారీ చేసేంద

హజ్ యాత్రికులకు వైద్య పరీక్షల కోసం ఏర్పాట్లు
పవిత్ర హజ్ యాత్ర-2027(1448-హెచ్)కు దరఖాస్తు చేసుకొని ఎంపికైన హాజీలకు రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య, శారీరక దృఢత్వ ధ్రువీకరణ పత్రాలను జారీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మైనారిటీ, న్యాయశాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. హజ్ కమిటీ ఆఫ్ ఇండియా జారీచేసిన సర్కులర్ ప్రకారం తప్పనిసరిగా నిర్దేశిత వైద్య పరీక్షలు చేయించుకుని శారీరక దృఢత్వ ధ్రువీకరణ పత్రాలను పొందాల్సి ఉందని మంత్రి పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఏర్పాట్లకు సంబంధించి రాష్ట్రంలోని అన్ని జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు (డిఎంహెచ్వోలు) ఆదేశాలను రాష్ట్ర హజ్ కమిటీ జారీ చేయడం కూడా జరిగిందని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి ఎంపికైన హజ్ యాత్రికులకు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు/ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహించేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించడం జరిగిందన్నారు. అధీకృత ప్రభుత్వ అల్లోపతిక్ వైద్య అధికారులు నిర్దేశిత వైద్య పరీక్షలు నిర్వహించి, శారీరక దృఢత్వ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తారని మంత్రి ఫరూక్ తెలిపారు.
Hajj 2027
Hajj Pilgrims
Hajj Committee of India
Andhra Pradesh Hajj Committee
NMD Farooq
Medical Examination
Physical Fitness Certificate
శారీరక దృఢత్వ ధ్రువీకరణ పత్రం
ఆరోగ్య ధ్రువీకరణ పత్రం
హజ్ యాత్ర
మైనారిటీ సంక్షేమం
ఆంధ్రప్రదేశ్
Scroll for the next article