News28th Mar 08:39 AMSunil Byrisetty2 min read
మెడికల్ మాఫియా.. కోట్ల కుంభకోణం సీక్రెట్ ఇదే
వైద్యం వ్యాపారంగా మారిపోయింది. చిన్న ఆరోగ్య సమస్యకూ టెస్టుల పేరుతో డబ్బు దోచేస్తున్నారు. వైద్య వ్యవస్థపై లూధియానాకు చెందిన డా. ప్రదీప్ అగర్వాల్ ఏమంటున్నారంటే.. గుండెపోటు వచ్చిందంటే
వైద్యం వ్యాపారంగా మారిపోయింది.
చిన్న ఆరోగ్య సమస్యకూ టెస్టుల పేరుతో డబ్బు దోచేస్తున్నారు.
వైద్య వ్యవస్థపై లూధియానాకు చెందిన డా. ప్రదీప్ అగర్వాల్ ఏమంటున్నారంటే..
గుండెపోటు వచ్చిందంటే వైద్యులు రూ. 9,000 స్ట్రెప్టోకినేస్ ఇంజక్షన్ ఇవ్వమంటున్నారు.
కానీ ఇంజెక్షన్ అసలు ధర రూ. 700 నుంచి 900 అయితే MRP మాత్రం రూ. 9,000. మీరేం చేస్తారు అప్పుడు? టైఫాయిడ్ వచ్చిందనగానే వైద్యులు 14 మోనోసోఫ్ రాశారు.
హోల్‌సేల్ ధర రూ.25 అయితే హాస్పిటల్ కెమిస్ట్ రూ.53 చొప్పున బిల్ వేశాడు.
అప్పుడు మీరేం చేస్తారు? కిడ్నీ ఫెయిల్యూర్ అయితే మూడు రోజులకొకసారి డయాలసిస్ చేయాలి.
మోడ్‌టరే డయాలసిస్ ఇంజెక్షన్ MRP రూ. 1800, దీన్ని హోల్‌సేల్ మార్కెట్ నుంచి తీసుకోవాలని మీరు అనుకుంటారు! కానీ ఇండియా మొత్తం వెతికినా మీకు ఎక్కడా దొరకదు... ఎందుకు? కంపెనీ వైద్యులకు మాత్రమే సరఫరా చేస్తుంది.
ఇంజెక్షన్ అసలు ధర రూ. 500 అయితే వైద్యులు వారి ఆసుపత్రిలో MRP రూ. 1,800 వసూలు చేస్తారు. డాక్టర్ రాసిన యాంటీబయాటిక్ మందులు జెనరిక్ ఉపయోగించరు.
ప్రిస్క్రిప్షన్ ప్రకారం హాస్పిటల్ మెడికల్ షాపుల్లో మాత్రమే తీసుకోవాలి అంటారు. MRPకి, హోల్‌సేల్‌కి సుమారు మూడు రెట్లు తేడా ఉంటుంది.
మీరేమి చేస్తారు ? మార్కెట్‌లో అల్ట్రాసౌండ్ పరీక్ష ధర రూ. 750, ట్రస్ట్ ఫార్మసీ రూ. 240కి చేస్తాడు.
అంటే డాక్టర్స్ కమీషన్ రూ. 300 అన్నమాట.
ఎంఆర్‌ఐపై డాక్టర్ కమిషన్ రూ. 2,000 నుంచి 3,000. దేశంలో డాక్టర్లు, ఆసుపత్రుల విపరీతమైన దోపిడీ జరుగుతోంది.
ఔషధ కంపెనీల లాబీ దేశాన్ని నియంత్రించేంత బలంగా ఉంది.
అందులో డాక్టర్లు, ఫార్మాస్యూటికల్ కంపెనీలు ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాయి.
మీడియా కూడా బ్రేకింగ్ న్యూస్ తప్ప డాక్టర్లు, మందుల కంపెనీలు, హాస్పిటల్ ఫార్మాస్యూటికల్స్ దోపిడీని ఎందుకు చూపవు? మెడికల్ లాబీ క్రూరత్వాన్ని ఎలా నిరోధించాలి? మీడియా ఎందుకు మౌనంగా ఉంది? దీన్ని ఐదుగురికి పంపితే, వారు తదుపరి ఐదుగురికి పంపుతారు! అందరూ పంపితే దేశమంతా ఒక్కతాటిపైకి వస్తుందని డా. అగర్వాల్ చెబుతున్నారు.