News9th Jul 04:03 PMSunil Byrisetty1 min read

రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన.. రాజముద్రతో పట్టా పుస్తకాలు

రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యల్ని పరిష్కరించి, ప్రజలకు వారి ఆస్తిపై పక్కాగా హక్కు కల్పించే లక్ష్యంతో పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నం

రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన.. రాజముద్రతో పట్టా పుస్తకాలు
రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యల్ని పరిష్కరించి, ప్రజలకు వారి ఆస్తిపై పక్కాగా హక్కు కల్పించే లక్ష్యంతో పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నం రూరల్ గోకవరం గ్రామంలో ‘మీ భూమి మీ హక్కు’కార్యక్రమంలో ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావుతో కలిసి పాల్గొని రైతులకు పట్టాలు పంపిణీ చేశారు. రవీంద్ర మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు కష్టబడుతున్నారు. ప్రజల ఆస్తికి వారు మాత్రమే యజమానులుగా ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర సర్వే నిర్వహించి పట్టాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గతంలో సర్వే రాళ్లపై, పట్టాదారు పాస్ పుస్తకాలపై కూడా జగన్ రెడ్డి తన బొమ్మలేసుకున్నారు. భూ హక్కు చట్టం పేరుతో ప్రజల ఆస్తిని కూడా కొట్టేయాలని ప్రయత్నించారని ఆరోపించారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలు బిక్కు బిక్కుమంటూ బతికారు. కానీ నేడు స్వేచ్ఛగా తిరుగుతున్నారని పేర్కొన్నారు. గతంలో సమస్య చెప్పుకోవాలన్నా భయపడే పరిస్థితి నుండి.. స్వేచ్ఛగా గ్రీవెన్స్ కి వచ్చి సమస్య చెప్పుకునే వెసులుబాటు కల్పించామని వివరించారు.
Andhra Pradesh
Kollu Ravindra
Mee Bhoomi Mee Hakku
Pattadar Passbooks
Revenue Reforms
Land Rights
Farmers
Machilipatnam
N. Chandrababu Naidu
నారా లోకేష్
కొనకళ్ల నారాయణరావు
ఏపీ ప్రభుత్వం
భూ సర్వే
Scroll for the next article