News5th Jul 12:29 PMSunil Byrisetty1 min read
నగర వైభవాన్ని చాటిచెప్పేలా విజయవాడ ఉత్సవ్
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఏటా శరన్నవరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతాయని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తెలిపారు. దసరా ఉత్సవాల సమయంలో విజయవాడ నగర వైభవాన్ని చాటిచెప
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఏటా శరన్నవరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతాయని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తెలిపారు. దసరా ఉత్సవాల సమయంలో విజయవాడ నగర వైభవాన్ని చాటిచెప్పేలా.. విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక, కళా వారసత్వాన్ని ప్రతిబింబించేలా విజయవాడ ఉత్సవ్ ఆలోచనకు కార్యరూపమిచ్చేందుకు కసరత్తు చేస్తున్నామని అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో విజయవాడ ఉత్సవ్‌పై జరిగిన ప్రాథమిక సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్, కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు, నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం తదితరులు పాల్గొని చర్చించారు. హరిత బెరం పార్కు, పున్నమి ఘాట్, భవానీ ఐలాండ్, పవిత్ర సంగమం, తుమ్మలపల్లి కళాక్షేత్రం తదితర ప్రాంతాల్లో వైవిధ్య కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. జానపద కళలను ప్రోత్సహించడంతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, ఫుడ్ ఫెస్ట్‌లు, వాటర్ స్పోర్ట్స్, డ్రోన్ షో, లేజర్ షో, థీమ్ బ్యూటిఫికేషన్ వంటివాటిపై దృష్టిసారిస్తున్నట్లు వివరించారు. అదేవిధంగా ఎగ్జిబిషన్ సొసైటీకి పూర్వవైభవం తీసుకొచ్చేలా మెగా ఎగ్జిబిషన్ ఏర్పాటుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు.