Crime9th Nov 03:38 PMSunil Byrisetty1 min read

మెగా ఆపరేషన్.. సైబర్ నేరగాళ్ల అరెస్ట్!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భారీ ఆపరేషన్‌ను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో విజయవంతంగా పూర్తి చేసింది. ఐదు రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి, రూ.95 కోట్ల మేర మోసాలకు పాల్

మెగా ఆపరేషన్.. సైబర్ నేరగాళ్ల అరెస్ట్!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భారీ ఆపరేషన్‌ను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో విజయవంతంగా పూర్తి చేసింది. ఐదు రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి, రూ.95 కోట్ల మేర మోసాలకు పాల్పడిన 81 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసింది. వీరిపై దేశవ్యాప్తంగా 754 కేసులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సైబర్ నేరగాళ్ల కదలికలపై నిఘా పెట్టిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో.. ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో మొత్తం 81 మందిని అదుపులోకి తీసుకుంది. అరెస్టయిన వారిలో 17 మంది ఏజెంట్లు, ఏడుగురు మహిళలు, 58 మంది మ్యూల్ ఖాతాదారులు ఉన్నారు. నిందితుల నుంచి 84 సెల్‌ఫోన్లు, 101 సిమ్‌ కార్డులు, 89 బ్యాంకు పాస్‌బుక్‌లు, చెక్‌బుక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా సభ్యుల బ్యాంకు ఖాతాల్లో ఉన్న కోట్లాది రూపాయల నగదును చట్టపరమైన ప్రక్రియ తర్వాత బాధితులకు అందజేయనున్నట్లు వారు వెల్లడించారు.
Cyber Crime
Telangana Police
Fraud Busters
India News
Cyber Security
Police Operation
Arrests
Financial Fraud
Telecom Fraud
Bank Fraud
India Crime News
Multi State Operation
Scroll for the next article