Education18th Sep 11:32 AMSunil Byrisetty1 min read

భారీ వర్షాల కారణంగా డీఎస్సీ నియామక పత్రాల అందజేత వాయిదా

మెగా డీఎస్సీ నియామక పత్రాల పంపిణీకి స్వల్ప బ్రేక్ పడింది. అమరావతిలో ఈ నెల 19న జరగాల్సిన మెగా డీఎస్సీ – 2025 నూతన ఉపాధ్యాయుల నియామక పత్రాల అందజేత కార్యక్రమం వాయిదా వేసినట్లు మెగా డీ

భారీ వర్షాల కారణంగా డీఎస్సీ నియామక పత్రాల అందజేత వాయిదా
మెగా డీఎస్సీ నియామక పత్రాల పంపిణీకి స్వల్ప బ్రేక్ పడింది. అమరావతిలో ఈ నెల 19న జరగాల్సిన మెగా డీఎస్సీ – 2025 నూతన ఉపాధ్యాయుల నియామక పత్రాల అందజేత కార్యక్రమం వాయిదా వేసినట్లు మెగా డీఎస్సీ కన్వీనర్ ఎం.వి.కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం గుంటూరులో భారీ వర్షాల కారణంగా అభ్యర్థుల రాకపోకలను దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం వాయిదా వేసినట్లు తెలిపారు. కార్యక్రమ నిర్వహణ తేదీలు త్వరలో ప్రకటిస్తామని మెగా డీఎస్సీ కన్వీనర్ ఎం.వి.కృష్ణారెడ్డి తెలిపారు. అయితే ఇప్పటికే సెలెక్టెడ్ అభ్యర్థుల జాబితా ప్రకటించిన విషయం తెలిసిందే.
Andhra Pradesh
Mega DSC 2025
Teacher Recruitment
Appointment Letters
Postponed Event
Guntur Rains
Weather Impact
Education Department
DSC Convener MV Krishna Reddy
రిక్రూట్మెంట్ అప్‌డేట్స్
మెగా డీఎస్సీ 2025
Scroll for the next article