News6th Jun 06:19 PMSunil Byrisetty1 min read
ఏడేళ్ల తర్వాత విజయవంతంగా మెగా డిఎస్సీ
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలిసారిగా అత్యధికంగా 16,347 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సీ చేపట్టామని, ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగిన అధ్యాయమని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలిసారిగా అత్యధికంగా 16,347 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సీ చేపట్టామని, ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగిన అధ్యాయమని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్య, వయోజన విద్య, సమగ్రశిక్ష ఉన్నతాధికారులతో 4గంటలకు పైగా సుదీర్ఘంగా వివిధ అంశాలపై సమీక్ష చేశారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ... ఎటువంటి సమస్యలు తలెత్తకుండా డిఎస్సీ పరీక్ష ప్రక్రియను ప్రారంభించిన అధికారులను అభినందించారు. డిఎస్సీ పరీక్షకు తొలిరోజు ఉదయం 88శాతం, సాయంత్రం సెషన్ లో 86శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు తెలిపారు. అకడమిక్ క్యాలెండర్, లీప్ యాప్ కూడా సిద్ధం చేశామని చెప్పారు. ఇకపై ప్రతిఏటా డిఎస్సీ నిర్వహణ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేసి విద్యాప్రమాణాలను మెరుగుపరుస్తామని మంత్రి లోకేష్ చెప్పారు. ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను కూడా విజయవంతంగా ప్రారంభించామని తెలిపారు. 27వేలమందికిపైగా స్కూల్ అసిస్టెంట్ల బదిలీలను ఆన్ లైన్ విధానంలో పారదర్శకంగా చేపట్టాం. ఇదివరకెన్నడూ లేనివిధంగా 4వేల మందికి పైగా టీచర్లకు స్కూల్ అస్సిటెంట్లు గా ప్రమోషన్లు కూడా ఇస్తున్నామని తెలిపారు.