Education15th Sep 10:11 AMSunil Byrisetty1 min read
మెగా డీఎస్సీ తుది ఎంపిక జాబితా విడుదల
మెగా డీఎస్సీ తుది ఎంపిక జాబితాను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తన ఎక్స్ ఖాతా ద్వారా విడుదల చేశారు. "మెగా డీఎస్సీ హామీని నెరవేర్చాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సచివాలయంలో
మెగా డీఎస్సీ తుది ఎంపిక జాబితాను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తన ఎక్స్ ఖాతా ద్వారా విడుదల చేశారు. "మెగా డీఎస్సీ హామీని నెరవేర్చాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన వెంటనే మెగా డీఎస్సీ ఫైల్ పై తన మొదటి సంతకం చేశారు.
150 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ విజయవంతంగా మెగా డీఎస్సీ-2025ను పూర్తిచేసింది.
ఫైనల్ లిస్ట్ సెలెక్షన్ లో ఉన్న విజయవంతమైన అభ్యర్థులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
మెగా డీఎస్సీ తుది ఎంపిక జాబితా ఈ రోజు ఉదయం 9.30 నుంచి అధికారిక వెబ్ సైట్ www.apdsc.apcfss.in. ద్వారా అందుబాటులో ఉంచడం జరిగింద"ని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.