Education4th Aug 03:42 PMSunil Byrisetty1 min read

పది రోజుల్లో మెగా డీఎస్సీ ఫలితాలు

ఈ నెల 15లోగా మెగా డీఎస్సీ-2025 ఫలితాలను విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. అలాగే 16 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభించనుంది. క్రీడల కోటాలో ఉన్న 421 పోస్టులకు సంబంధిం

పది రోజుల్లో మెగా డీఎస్సీ ఫలితాలు
ఈ నెల 15లోగా మెగా డీఎస్సీ-2025 ఫలితాలను విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. అలాగే 16 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభించనుంది. క్రీడల కోటాలో ఉన్న 421 పోస్టులకు సంబంధించిన వివరాలు ఇంకా శాప్ నుంచి అందలేదు. అవి రాగానే జిల్లాల్లో కటాఫ్ మార్కులు ప్రకటించనుంది. ఈలోగా మార్కుల నార్మలైజేషన్ ప్రక్రియ పూర్తిచేయనున్నారు. నెలా ఖరు నాటికి కొత్త టీచర్లకు పోస్టింగులు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ యోచిస్తోంది. కాగా, కొత్తగా వచ్చే 16,347 మంది ఉపాధ్యాయులకు వారాంతాల్లో శిక్షణ ఇవ్వాలని యోచిస్తోంది. సాధారణంగా ఈ శిక్షణ పోస్టింగ్లకు ముందే పూర్తిచేయనున్నారు. శని, ఆదివారాల్లో శిక్షణ ఇచ్చి సెప్టెంబరు మొదటి వారం నుంచే కొత్త టీచర్లు పాఠశాలల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశించింది.
AP education news
Mega DSC 2025
DSC Results 2025
AP DSC updates
DSC certificate verification
teacher job updates
AP teacher recruitment
Mega DSC cutoff marks
DSC sports quota
Scroll for the next article