Jobs19th Jul 09:48 AMSunil Byrisetty1 min read

20న మచిలీపట్నంలోని నోబుల్ కాలేజీలో జాబ్ మేళా

డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ & ట్రైనింగ్ ఆధ్వర్యంలో, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు సోమవారం మచిలీపట్నంలోని నోబుల్ డిగ్రీ కళాశాలలో "జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్

20న మచిలీపట్నంలోని నోబుల్ కాలేజీలో జాబ్ మేళా
డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ & ట్రైనింగ్ ఆధ్వర్యంలో, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు సోమవారం మచిలీపట్నంలోని నోబుల్ డిగ్రీ కళాశాలలో "జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ తెలియజేసారు. ఈ జాబ్ మేళాలో శ్రీరామ్ ఫైనాన్స్, ఎస్ ఎస్ వి సొల్యూషన్స్, ఇన్నోవ్‌సోర్స్, జస్ట్ డయల్ లిమిటెడ్, రాండ్ స్టాండ్, వరుణ్ మోటార్స్, ఆర్ ఆర్ ట్రేడర్స్ & మాన్యుఫాక్చర్స్, టికోన ఇన్ఫైనెట్, టాటా ఎలక్ట్రానిక్స్, MRF లిమిటెడ్, TVS, వసంత, ఫ్లిప్కార్ట్, బ్లింకెట్, మ్యాన్ పవర్, డైకిన్,డిక్సన్ వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని ఉపాధి అధికారి Y. సత్యబ్రహ్మం తెలిపారు. ఈ కంపెనీలలో ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ, ఫార్మసి పూర్తి చేసిన 18 నుండి 35 సంవత్సరాల లోపు యువత అర్హులని, ఎంపిక అయిన వారికి మంచి వేతనము, ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు కలవని తెలిపారు. ఆసక్తి, అర్హతలు గల అభ్యర్థులు https://naipunyam.ap.gov.in/user-registration లింక్లో తమ వివరాలతో రిజిస్టర్ కావడంతోపాటు, జాబ్ మేళాకు రెజ్యూమె, ఆధార్, ఆధార్ కు లింక్ అయిన ఫోన్ నంబర్, PAN, సర్టిఫికెట్ల జిరాక్సు కాపీలతో రావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 8142416211, 9966489796 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.
Andhra Pradesh
Employment
Job Mela
Machilipatnam
Y. Satyabrahmam
Noble Degree College
Recruitment Drive
Skill Development
Tata Electronics
Flipkart
MRF
TVS
Jobs
Scroll for the next article