Jobs7th Jul 04:01 PMSunil Byrisetty1 min read
ఉద్యోగావకాశాల కల్పనకు జాబ్‌మేళాలు
నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగావకాశాలు పొందేలా జాబ్ మేళాలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఉపాధి, శిక్షణ శాఖ అధికారులకు సూచించారు. స్వర్ణాంధ్ర 20
నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగావకాశాలు పొందేలా జాబ్ మేళాలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఉపాధి, శిక్షణ శాఖ అధికారులకు సూచించారు. స్వర్ణాంధ్ర 2047 దార్శనిక ప్రణాళికకు అనుగుణంగా దశల వారీ లక్ష్యాలను సాధించేందుకు కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇగ్నైట్ సెల్‌ను కలెక్టర్ డా. జి. లక్ష్మీశ సందర్శించారు. నిరుద్యోగ యువతకు మెరుగైన ఉద్యోగావకాశాలను కల్పించేందుకు జాబ్‌మేళాలను నిర్వహించాలన్నారు. అవసరమైన వారికి నైపుణ్య శిక్షణను అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకునేలా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. యువతకు సుస్థిర ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ఈ ఏడాది ఇప్పటి వరకు 53 జాబ్ మేళాలను నిర్వహించి సుమారు 900 మందికి పైగా ఉపాధి అవకాశాలను కల్పించడం అభినందనీయమన్నారు. పదోవ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, పీజీ పూర్తిచేసి అర్హత కలిగిన వారికి ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ఈ నెలలో మెగా జాబ్‌మేళాను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు.