Jobs12th Jul 04:45 PMSunil Byrisetty1 min read

ఏలూరులో మెగా జాబ్ మేళా

ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ ఆధ్వర్యంలో జూలై 14న మెగా జాబ్ మేళా నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్ధ ద్వారా జులై 14న ఉదయం

ఏలూరులో మెగా జాబ్ మేళా
ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ ఆధ్వర్యంలో జూలై 14న మెగా జాబ్ మేళా నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్ధ ద్వారా జులై 14న ఉదయం 9.30 గంటల నుంచి ఏలూరు సి.ఆర్.రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో మెగా జాబ్ మేళా జరుగుతుంది. ఈ జాబ్ మేళాకు 39కి పైగా కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు హాజరై 3 వేల మందిని అర్హత ప్రామాణికంగా పదో తరగతి, ఇంటర్, ఐటిఐ, డిగ్రీ, బిఫార్మసీ, ఎంఫార్మసీ, బిటెక్, తదితర కోర్సులు పూర్తి చేసిన వారిని ఆయా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. కావున అర్హత గల అభ్యర్దులందరూ ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ సూచించారు. జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్ధులు ముందుగా ఆన్ లైన్లో రిజిస్ట్రేషన్ లింకు https://naipunyam.ap.gov.in/user-registration లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. అభ్యర్ధులు తప్పనిసరిగా ఫార్మల్ డ్రెస్ లో రెస్యూమ్ తీసుకొని హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాలకు 9493482414, 8978524022, 8143549464, 9618194377, 9885519299. నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.
Andhra Pradesh
Jobs
Mega Job Fair in Eluru
Putta Mahesh Kumar
C.R. Reddy Engineering College
39 companies
mega job mela
Scroll for the next article