News1st Jul 12:49 PMSunil Byrisetty1 min read
భవానీపురం ఎన్డీయే కార్యాలయంలో మెగా మెడికల్ క్యాంప్
విజయవాడ పశ్చిమ బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి భవానీపురం ఎన్డీయే కార్యాలయంలో మెగా మెడికల్ క్యాంప్‌ను ప్రారంభించారు. డాక్టర్స్ డే ను పురస్కరించుకుని సుజనా ఫౌండేషన్, రౌండ్ టేబుల్ ఇండియా
విజయవాడ పశ్చిమ బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి భవానీపురం ఎన్డీయే కార్యాలయంలో మెగా మెడికల్ క్యాంప్‌ను ప్రారంభించారు. డాక్టర్స్ డే ను పురస్కరించుకుని సుజనా ఫౌండేషన్, రౌండ్ టేబుల్ ఇండియా, లేడీస్ సర్కిల్, మరియు రోటరీ క్లబ్‌ల సంయుక్త ఆధ్వర్యంలో క్యాంప్ నిర్వహిస్తున్నారు. అంకాలజీ, కార్డియాలజీ, ఎండో క్రినాలజీ, గైనకాలజీ, ఆప్తమాలజీ, తదితర సూపర్ స్పెషాలిటీ విభాగాల నిపుణులచే శిబిరం నిర్వహిస్తున్నారు. పేదలకు వైద్య సేవలు అందించేందుకు రౌండ్ టేబుల్ వంటి సేవా సంస్థల ద్వారా యువకులు ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. ప్రజా వైద్యానికి సంబంధించి అన్ని విధాలుగా నేను సుజనా ఫౌండేషన్ ద్వారా సహకారం అందిస్తానని సుజనా చౌదరి చెప్పారు. రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గ ప్రజలకు వైద్య సేవలు అందిస్తానని, ఇటువంటి శిబిరాలు మరిన్నినిర్వహిస్తామని వివరించారు.