News5th Dec 03:06 PMSunil Byrisetty1 min read
పండుగ వాతావరణంలో మెగా పీటీఎం
పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం భామిని ఆదర్శ పాఠశాల, జూనియర్ కాలేజీలో నిర్వహించిన మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్(మెగా పీటీఎం 3.0) ఆద్యంతం పండుగ వాతావరణంలో జరిగింది. ఈ
పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం భామిని ఆదర్శ పాఠశాల, జూనియర్ కాలేజీలో నిర్వహించిన మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్(మెగా పీటీఎం 3.0) ఆద్యంతం పండుగ వాతావరణంలో జరిగింది. ఈ వేడుకకు పెద్దఎత్తున విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరయ్యారు. ముందుగా భామిని ఆదర్శ పాఠశాల ఆవరణానికి చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలల్లో గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్(పౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ) కార్యక్రమాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో సీఎం, మంత్రి లోకేష్ ఇంటరాక్ట్ అయ్యారు. గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ యాప్ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మంత్రి లోకేష్ వివరించారు. ఎఫ్ఎల్ఎన్ యాప్ ద్వారా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను, ప్రోగ్రెస్ రిపోర్ట్ లను ఈ సందర్భంగా సీఎం పరిశీలించారు. అనంతరం జాదూ పిఠార్, గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ మెటీరియల్ ను పరిశీలించారు.