Education29th Jul 09:41 AMSunil Byrisetty1 min read

గిన్నిస్ రికార్డుల్లో మెగా పీటీఎం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ప్రపంచంలోనే అతిపెద్ద పేరెంట్-టీచర్ మీటింగ్ (MEGA PTM) నిర్వహించి గిన్నిస్ ప్రపంచ రికార్డును నెలకొల్పిందని, ఈ గిన్నిస్ రికార్డు ఉపాధ్యాయుల‌కు అంకితం అని విద్య

గిన్నిస్ రికార్డుల్లో మెగా పీటీఎం
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ప్రపంచంలోనే అతిపెద్ద పేరెంట్-టీచర్ మీటింగ్ (MEGA PTM) నిర్వహించి గిన్నిస్ ప్రపంచ రికార్డును నెలకొల్పిందని, ఈ గిన్నిస్ రికార్డు ఉపాధ్యాయుల‌కు అంకితం అని విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ప్ర‌క‌టించారు. గిన్నిస్ బుక్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్ ప్రకారం మెగా పీటీఎంలో 5.34 మిలియన్ల (53.4 లక్షలు) తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, పాఠశాల యాజమాన్యం, పాఠశాల నిర్వహణ కమిటీ (SMC) సభ్యులు, ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న వారితో సహా మొత్తం 15.2 మిలియన్ల (1.5 కోట్లు) మంది అతిపెద్ద పేరెంట్-టీచర్ మీటింగులో భాగ‌మ‌య్యారు. జాతీయ విద్యా విధానం ఐదవ వార్షికోత్సవం జూలై 29కి ఒక రోజు ముందు మెగా పేరెంట్ టీచ‌ర్ మీటింగ్ గిన్నిస్ రికార్డు సాధించ‌డం చాలా ఆనందంగా ఉందన్నారు. అధికారిక గిన్నిస్ ప్రపంచ రికార్డు ధృవపత్రం ఆగస్టు రెండవ వారంలో అమరావతిలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో అందజేస్తారు.
Andhra Pradesh news
Guinness World Record
Mega PTM
Parent-Teacher Meeting
Nara Lokesh
NEP Anniversary
School Education
SMC Participation
Mega PTM 2025
మెగా పీటీఎం
గిన్నిస్ ప్రపంచ రికార్డు
ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ
Scroll for the next article