News25th Apr 10:00 AMSunil Byrisetty2 min read

మైండ్ సెట్ ప్రతి మనిషిలో కీలకం

మైండ్ సెట్ అనేది ప్రతి మనిషిలో కీలకంగా ఉంటుందని, ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా పాజిటివ్‌గా ఆలోచన చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తాము ఇలా ఉన్నామంటే కారణం పాజిటివ్ థిం

మైండ్ సెట్  ప్రతి మనిషిలో కీలకం
మైండ్ సెట్ అనేది ప్రతి మనిషిలో కీలకంగా ఉంటుందని, ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా పాజిటివ్‌గా ఆలోచన చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తాము ఇలా ఉన్నామంటే కారణం పాజిటివ్ థింకింగ్ అని, పాజిటివ్ థింకింగ్ ఎనర్జీ ఇస్తుందని చెప్పారు. ఏపీ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె శరణి ‘మైండ్ సెట్ షిఫ్ట్ ’ అనే పుస్తకం రాశారు. వివిధ ప్రాంతాల్లో పర్యటించి, వివిధ వ్యక్తులను పరిశీలించి శరణి ఈ పుస్తకాన్ని రాశారు. విజయవాడలో ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శరణి అడిగిన ప్రశ్నలకు సీఎం చంద్రబాబు గారు చిరంజీవి సరదాగా సమాధానం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నారాయణ విద్యా సంస్థలు ఒక బ్రాండ్. ఆర్డినరీ స్టూడెంట్‌లను ఎక్స్‌ట్రా ఆర్డినరీగా మారుస్తారని అన్నారు. ఈ సందర్భంగా శరణి అడిగిన ప్రశ్నలకు సీఎం చంద్రబాబు, చిరంజీవి సరదాగా సమాధానం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నారాయణ విద్యా సంస్థలు ఒక బ్రాండ్. ఆర్డినరీ స్టూడెంట్‌లను ఎక్స్‌ట్రా ఆర్డినరీగా మారుస్తారు. మీరు అదే నారాయణ దగ్గర పెరిగారు కాబట్టి ఇంత ప్రతిభావంతులు అయ్యారు. నన్ను శరణి కలిసినప్పుడు చిన్న పిల్ల అనుకున్నా. ఇప్పుడు మీరు ఎదిగిన తీరు చూసి ముచ్చటేస్తుంది అని వ్యాఖ్యానించారు. శరణి చిన్న వయసులోనే పాజిటివ్‌గా ఉండబట్టే ఈ రోజు ఇలా నిలబడ్డారన్నారు. నమ్మకానికి సంకల్పం తోడైతే ఎన్ని సవాళ్లనైనా అధిగమించవచ్చు. నేనైనా, చిరంజీవి అయినా, ఎన్టీఆర్ అయినా సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వాళ్లమే. మనిషి దృఢసంకల్పం ఎంతలా పని చేస్తుందో ఎన్టీఆర్ జీవితమే ఓ ఉదాహరణ. ఇప్పటి కంప్యూటర్లకు వెయ్యి రెట్లు వేగంగా పనిచేసే క్వాంటంమ్ కంప్యూటింగ్‌ని త్వరలోనే చేపడుతున్నాం. ఏఐ అనేది ఓ రియాలిటీ. అందుకే అధికారులందరికీ ఏఐ నేర్పిస్తున్నామన్నారు.
CM Chandrababu Naidu
Megastar Chiranjeevi
Chandrababu Visionary
fridayculture
నారాయణ కుమార్తె శరణి ‘మైండ్ సెట్ షిఫ్ట్ ’ అనే పుస్తకం రాశారు
Scroll for the next article