Celebrities18th Mar 12:25 PMSunil Byrisetty1 min read

అవార్డు స్వీకరణకు లండన్‌ వెళ్లిన చిరంజీవి

టాలీవుడ్ మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవి లండన్ వెళ్లారు. ఇటవల యూకే ప్రభుత్వం ఆయనకు జీవన సాఫల్య పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. కళారంగంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన కృషికి యునై

అవార్డు స్వీకరణకు లండన్‌ వెళ్లిన చిరంజీవి
టాలీవుడ్ మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవి లండన్ వెళ్లారు. ఇటవల యూకే ప్రభుత్వం ఆయనకు జీవన సాఫల్య పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. కళారంగంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన కృషికి యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వం ఆయనను సన్మానించనుంది. యూకే పార్లమెంట్ చిరంజీవికి 'లైఫ్ఎమ్ అచీవ్మెంట్ అవార్డు'ను ప్రదానం చేయనుంది. అందుకోసం ఆయన లండన్ బయలుదేరి వెళ్లారు. యూకేలో కూడా మెగాస్టార్‌కు ఉన్న క్రేజ్ మామూలుగా లేదు. లండన్ విమానాశ్రయంలోనే ఆయనకు అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. గత ఏడాది ఆయన్ను పద్మవిభూషణ్ అవార్డు, ఏఎన్ఆర్ జీవిత సాఫల్య పురస్కారం వరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక అవార్డను ఆయన అందుకోనున్నారు.
Megastar chiranjeevi
Hero
Actor
Award
UK
మెగాస్టార్ చిరంజీవి
హీరో
నటుడు
అవార్డు
UK
Scroll for the next article