International17th Oct 11:42 AMSunil Byrisetty1 min read

మేఘకు కువైట్‌లో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు

కువైట్‌లో 225.5 మిలియన్ డాలర్ల ప్రతిష్టాత్మక ప్రాజెక్టును మేఘ ఇంజినీరింగ్ లిమిటెడ్(ఎంఈఐఎల్) దక్కించుకుంది. కేఓసీకి గ్యాస్ స్వీటెనింగ్ ప్లాంట్, సల్ఫర్ రికవరీ యూనిట్ ఎంఈఐఎల్ నిర్మించ

మేఘకు కువైట్‌లో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు
కువైట్‌లో 225.5 మిలియన్ డాలర్ల ప్రతిష్టాత్మక ప్రాజెక్టును మేఘ ఇంజినీరింగ్ లిమిటెడ్(ఎంఈఐఎల్) దక్కించుకుంది. కేఓసీకి గ్యాస్ స్వీటెనింగ్ ప్లాంట్, సల్ఫర్ రికవరీ యూనిట్ ఎంఈఐఎల్ నిర్మించి ఇవ్వనుంది. బిల్డ్ ఓన్ ఆపరేట్ పద్దతిలో కువైట్ ప్లాంట్ నిర్మాణం జరగనుంది. 790 రోజుల్లో ప్లాంట్ నిర్మాణం పూర్తి చేయడంతోపాటు, ఆ తరువాత ఐదు సంవత్సరాల పాటు ప్లాంట్ నిర్వహణ బాధ్యతల్లో ఎంఈఐఎల్ పాలుపంచుకోనుంది. ఇప్పటికే రాజస్థాన్, మంగోల్ రిఫైనరీలలో సల్ఫర్ రికవరీ యూనిట్లను ఎంఈఐఎల్ నిర్మిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా తాగునీరు, హైడ్రోకార్బన్, పవర్ వంటి రంగాల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా విజయవంతంగా ప్రాజెక్టులు అమలు చేస్తోంది. కువైట్‌లో ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగస్వామ్యం అవ్వడం మాకు గర్వకారణమని డైరెక్టర్ దొరయ్య పేర్కొన్నారు.
Global Business
MEIL
Kuwait Project
Engineering
Infrastructure
Global Expansion
Sulphur Recovery Unit
Gas Sweetening Plant
Energy Sector
Indian Engineering
Mega Project
KOC
BOO Model
MEIL Success
Scroll for the next article