Business Type17th Sep 01:48 PMSunil Byrisetty1 min read
రెస్టారెంట్లకు MenuToPay సేవలు.. నెలకు రూ.999 నుంచి ప్లాన్లు
రెస్టారెంట్లు, కేఫ్‌లు, ఫుడ్ ట్రక్కులు, హోటళ్లు, మల్టీ-అవుట్‌లెట్ సంస్థల కోసం MenuToPay డిజిటల్ ఆర్డరింగ్, పేమెంట్ సేవలను అందిస్తోంది. టేబుళ్ల వద్ద QR కోడ్ ద్వారా కస్టమర్లు న
రెస్టారెంట్లు, కేఫ్‌లు, ఫుడ్ ట్రక్కులు, హోటళ్లు, మల్టీ-అవుట్‌లెట్ సంస్థల కోసం MenuToPay డిజిటల్ ఆర్డరింగ్, పేమెంట్ సేవలను అందిస్తోంది. టేబుళ్ల వద్ద QR కోడ్ ద్వారా కస్టమర్లు నేరుగా ఆర్డర్ చేసుకునే సదుపాయం, కిచెన్ డిస్‌ప్లే సిస్టమ్ (KDS), GST ఇన్వాయిసింగ్, టిప్స్, స్ప్లిట్ బిల్లింగ్, టేక్‌అవే ఆర్డర్లు, ఇన్వెంటరీ నిర్వహణ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా కస్టమర్లు రెస్టారెంట్ UPIకి నేరుగా చెల్లించే విధానం ఉండటంతో ఆర్డర్లపై MenuToPay ఎలాంటి కమిషన్ తీసుకోదని సంస్థ తెలిపింది. సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లలో Starter రూ.999 నెలకు, Growth రూ.2,999, Business రూ.5,999గా ఉన్నాయి. పెద్ద హోటళ్లు, రిసార్టులు, మల్టీ-అవుట్‌లెట్ సంస్థలకు Enterprise ప్లాన్ కస్టమ్ ధరతో అందిస్తున్నారు. Starterలో ఒక లొకేషన్, Growthలో మూడు, Businessలో ఏడు లొకేషన్ల వరకు లైవ్ KDS సదుపాయం ఉంటుంది. QR ఆర్డరింగ్‌కు మాత్రం అన్ని ప్లాన్లలో టేబుళ్లపై ప్రత్యేక పరిమితి లేదని సంస్థ పేర్కొంది. సబ్‌స్క్రిప్షన్ చెల్లింపులను బ్యాంక్ ట్రాన్స్‌ఫర్, UPI లేదా చెక్ ద్వారా చేయవచ్చని MenuToPay తెలిపింది. ప్లాన్ సబ్‌స్క్రిప్షన్ మాత్రమే సంస్థకు చెల్లించాల్సి ఉంటుందని, కస్టమర్ చెల్లించిన ఆర్డర్ మొత్తం నేరుగా రెస్టారెంట్ బ్యాంక్ ఖాతాకు చేరుతుందని వెల్లడించింది.