News4th Oct 02:30 PMSunil Byrisetty1 min read
స్వచ్ఛాంధ్ర పురస్కారాలలో మెప్మాకు నాలుగు అవార్డులు!
పట్టణ పేదరిక నిర్మూలనకు కృషిచేస్తున్న మెప్మా సంస్థ, తాజాగా ప్రకటించిన రాష్ట్రస్థాయి స్వచ్ఛాంధ్ర పురస్కారాలలో ఒకేసారి ఏకంగా నాలుగు రాష్ట్రస్థాయి అవార్డులను సాధించి చరిత్ర సృష్టించిం
పట్టణ పేదరిక నిర్మూలనకు కృషిచేస్తున్న మెప్మా సంస్థ, తాజాగా ప్రకటించిన రాష్ట్రస్థాయి స్వచ్ఛాంధ్ర పురస్కారాలలో ఒకేసారి ఏకంగా నాలుగు రాష్ట్రస్థాయి అవార్డులను సాధించి చరిత్ర సృష్టించింది. బెస్ట్ సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ అవార్డు: స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిర్వహించిన ఈ పోటీలో 19 ప్రభుత్వ శాఖలు పాల్గొనగా, ఈ అవార్డును మెప్మా దక్కించుకోవడం విశేషం.. కంటెంట్ నాణ్యత, సృజనాత్మక ప్రచారాలు, రెగ్యులర్ పోస్టింగ్‌లు, ఎంగేజ్‌మెంట్ (లైక్స్, షేర్స్) స్వచ్ఛాంధ్ర థీమ్‌లను సమర్థంగా ప్రచారం చేసినందుకు ఈ గుర్తింపు లభించింది. మూడు స్టేట్ స్వచ్ఛ SLF లెవెల్ అవార్డులు: టెర్రస్ గార్డెన్, హోమ్ కంపోస్ట్ విభాగాల్లో జరిగిన పోటీల్లో మెప్మాకు చెందిన ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల SLFలు అవార్డులను గెలుచుకున్నాయి. ఈ ప్రతిష్టాత్మక అవార్డులను ఈ నెల 6న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా అందించనున్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి మెప్మా మిషన్ డైరెక్టర్ ఎన్. తేజ్ భరత్ ఈ సోషల్ మీడియా అవార్డును అందుకోనున్నారు.