News6th Nov 01:12 PMSunil Byrisetty1 min read

మళ్లీ తెరపైకి విలీన గ్రామాల పంచాయితీ

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా , తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు రేవంత్ రెడ్డి లకు తెలంగాణ వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు కీలక లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్లో జిల్లాల

మళ్లీ తెరపైకి విలీన గ్రామాల పంచాయితీ
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా , తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు రేవంత్ రెడ్డి లకు తెలంగాణ వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు కీలక లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజన నేపథ్యంలో భద్రాచలం పరిసర ఐదు గ్రామాలను తెలంగాణ రాష్ట్రంలో కలపాలని కోరారు. పునర్విభజన చట్టంలోని ఉభయ రాష్ట్రాల చర్చల సందర్భంగా ఈ అంశాన్ని సానుకూలంగా చర్చించి తెలుగు ప్రజల ముఖ్యంగా భద్రాద్రి, ఐదు గ్రామాల ప్రజల తీరని వేతలు తీర్చేలా ప్రత్యేక చొరవ చూపాలని మంత్రి తుమ్మల విన్నవించారు. పునర్విభజన చట్టంలోని భద్రాచలం పట్టణాన్ని ఆనుకుని ఉన్న యాటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల పంచాయతీలను తిరిగి తెలంగాణ రాష్ట్రానికి చేర్చే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. దీంతో రాష్ట్ర విభజన వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.
Telangana
Andhra Pradesh
Amit Shah
Chandrababu Naidu
Revanth Reddy
Tummala Nageswara Rao
Bhadradri
పునర్విభజన చట్టం
గుండాల పంచాయితీ
యాటపాక
కన్నాయిగూడెం
రాష్ట్ర విభజన
Scroll for the next article