News18th Jul 02:27 PMSunil Byrisetty1 min read
నాల్రోజులపాటు వానలే వానలు!
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారింది. వాతావరణంలో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం కారణంగా రానున్న నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారింది. వాతావరణంలో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం కారణంగా రానున్న నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. ఇటు తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్షాలపై హెచ్చరికలు జారీ అయ్యాయి. అటు ఏపీలోని కోస్తా ప్రాంతంలోనూ పలు చోట్ల భారీ వర్షాలు కురిసాయి. తెలంగాణలోనూ ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా చోట్ల ఉరుములు, మెరుపు లు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.