News21st Mar 02:58 PMSunil Byrisetty1 min read
గుడ్‌న్యూస్.. ఏపీలో మెట్రో కూత..
ఏపీలో మెట్రో రైల్ కూత పెట్టనుంది. విజయవాడ, విశాఖ నగరాల్లో మెట్రో రైళ్లు పరుగులు తీసేందుకు సిద్ధమవుతున్నాయి. విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుల కోసం కాంప్రహెన్సివ్ మొబిలిటీ
ఏపీలో మెట్రో రైల్ కూత పెట్టనుంది. విజయవాడ, విశాఖ నగరాల్లో మెట్రో రైళ్లు పరుగులు తీసేందుకు సిద్ధమవుతున్నాయి.
విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుల కోసం కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ రూపొందించాలని కేంద్రం సూచించింది.
అందుకోసం నిధులు కూడా మంజూరు చేసింది.
సీఎంపీ రూపొందించేందుకు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ కన్సల్టెన్సీ సంస్థను టెండర్ల ద్వారా ఎంపిక చేసింది.
విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు సీఎంపీకు 84.47 లక్షలు, విజయవాడకు 81.68 లక్షలు ఖర్చు కానున్నాయి.
విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు 66.15 కిలోమీటర్ల పొడవుతో రానుంది.
మొదటి దశలో 38.4 కిలోమీటర్లు, రెండో దశలో 27.75 కిలోమీటర్లు ఉంటుంది.
మొదటి దశలో 1152 కోట్లతో భూసేకరణ, రూ. 11,009 కోట్లతో మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణం ఉంటుంది.
గన్నవరం నుంచి విజయవాడ బస్టాండ్, బస్టాండ్ నుంచి పెనమలూరు, బస్టాండ్ నుంచి అమరావతి మొత్తం మూడు కారిడార్లలో విజయవాడ మెట్రో ఉంటుంది.
విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు కూడా మూడు కారిడార్లలో నిర్మితం కానుంది.
స్టీల్‌ప్లాట్ నుంచి కొమ్మాదికి 34.4 కిలోమీటర్లు, గురుద్వారా నుంచి పాత పోస్టాఫీసుకు 5.08 కిలోమీటర్లు, తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేర్ వరకు 6.75 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు.
ఇక కొమ్మాది నుంచి భోగాపురం వరకు 30.67 కిలోమీటర్లతో రెండవ దశ ఉంటుంది.
మొత్తం 76.9 కిలోమీటర్లతో విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు ఉంటుంది.