Education8th Jun 11:35 AMSunil Byrisetty1 min read
టెకీలకు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సూచన
కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్లకు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఓ సలహా ఇచ్చారు. సాఫ్ట్‌వేర్ రంగంలో ప్రవేశించాలనుకుంటే ఎలా చేయొచ్చో సూచనలు చేశారు. కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స
కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్లకు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఓ సలహా ఇచ్చారు. సాఫ్ట్‌వేర్ రంగంలో ప్రవేశించాలనుకుంటే ఎలా చేయొచ్చో సూచనలు చేశారు. కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) పాత్ర పెరుగుతున్నప్పటికీ అవకాశాలు ఉంటాయని స్పష్టం చేశారు. టెక్నాలజీ నిపుణులుగా రాణించాలనుకునే వారు ప్రాథమిక అంశాలపై పట్టు సాధించడం అత్యంత కీలకమన్నారు. సమస్యలను లాజిక్‌తో విభజించి, సరైన పరిష్కారాలను రూపొందించే నైపుణ్యమైన 'కంప్యూటేషనల్ థింకింగ్'ను అలవర్చుకోవాలని కీలక సూచనలు చేశారు.
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావాలనుకుంటే, సాఫ్ట్‌వేర్‌కి సంబంధించిన ప్రాథమిక అంశాలను నేర్చుకోవడం ముఖ్యమని భావిస్తున్నానన్నారు. ఇలా చేయడం ద్వారా సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్ అయ్యే మార్గం వేగవంతం అవుతుందని నాదెళ్ల పేర్కొన్నారు.