News7th Nov 03:31 PMSunil Byrisetty1 min read

ఏపీలో మైక్రోసాఫ్ట్ క్వాంటమ్ కంప్యూటర్ కేంద్రం

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులకు శ్రీకారం చుట్టింది. ఏకంగా రూ.1,772.08 కోట్ల విలువైన పెట్టుబడితో అమరావతిలో అత్యాధునిక క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రాన్ని ఏర

ఏపీలో మైక్రోసాఫ్ట్ క్వాంటమ్ కంప్యూటర్ కేంద్రం
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులకు శ్రీకారం చుట్టింది. ఏకంగా రూ.1,772.08 కోట్ల విలువైన పెట్టుబడితో అమరావతిలో అత్యాధునిక క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలో భాగంగా, అమరావతి క్వాంటమ్ వ్యాలీలో 1,200 క్యూబిట్ సామర్థ్యంతో (50 లాజికల్ క్యూబిట్స్) ఓ భారీ క్వాంటమ్ కంప్యూటర్‌ను మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం క్వాంటమ్ వ్యాలీ భవనానికి ఆనుకుని ఉన్న 4 వేల చదరపు అడుగుల ప్రత్యేక భవనాన్ని వినియోగించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (CRDA) ఇప్పటికే 50 ఎకరాల భూమిని కేటాయించింది. మైక్రోసాఫ్ట్ రాకతో అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు మరింత వేగం పుంజుకోనుంది. ఇప్పటికే మరో టెక్ దిగ్గజం ఐబీఎం 133 క్యూబిట్ సామర్థ్యంతో క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఐబీఎం సంస్థ టీసీఎస్, ఎల్&టీలతో కలిసి దేశంలోనే మొట్టమొదటి ఫుల్ స్టాక్ క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ ఏర్పాటుకు సహకారం అందిస్తోంది. మరోవైపు, జపాన్‌కు చెందిన ఫుజిట్సు కూడా 64 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్‌తో పాటు, ఒక ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించింది.
Andhra Pradesh
Microsoft
Quantum Computing
Amaravati Quantum Valley
CRDA
IBM
Fujitsu
Tech Investment
క్వాంటమ్ సాంకేతికత
క్వాంటమ్ కంప్యూటర్
అవిష్కరణ
ఐటి హబ్
టెక్ దిగ్గజాలు
Scroll for the next article