Jobs21st Apr 12:55 PMSunil Byrisetty1 min read
మిడిల్ క్లాస్ ఉద్యోగాలు మాయం? AI షాక్!
రాబోయే రోజుల్లో ఉద్యోగాలనేవి కనుమరుగు కానున్నాయా? మార్కెట్ గురూ సౌరభ్ ముఖర్జీయా ఏం చెబుతున్నారు. షాకింగ్ కామెంట్ చేశారు. జీతం తీసుకునే మిడిల్ క్లాస్ ఉద్యోగాలు ఇకపై ఎక్కువ కాలం ఉండక
రాబోయే రోజుల్లో ఉద్యోగాలనేవి కనుమరుగు కానున్నాయా? మార్కెట్ గురూ సౌరభ్ ముఖర్జీయా ఏం చెబుతున్నారు.
షాకింగ్ కామెంట్ చేశారు. జీతం తీసుకునే మిడిల్ క్లాస్ ఉద్యోగాలు ఇకపై ఎక్కువ కాలం ఉండకపోవచ్చట! కారణం అన్ని రంగాల్లో AI చొరబడటమేనంట.
కోడింగ్ పనుల్ని ఇప్పటికే కొట్టేస్తున్న ఏఐ ఇక IT, మీడియా, ఫైనాన్స్ రంగాల్లో కూడా విశ్వరూపం చూపించబోతోంది.
అంటే, ఇప్పుడు మనం చూస్తున్న, చేస్తున్న ఉద్యోగాలు ఇకపై ఉండకపోవచ్చు.
అయితే సొంతంగా బిజినెస్ చేసుకునేవాళ్లకు మాత్రం తిరుగులేదంటున్నారు.
గవర్నమెంట్ తెచ్చిన 'JAM' (జన్‌ధన్, ఆధార్, మొబైల్)తో పరిశ్రమల వ్యవస్థాపకతకు గేట్లు తెరుచుకున్నాయట.
అందుకే ముఖర్జీయా పిల్లల్ని కూడా ఉద్యోగాల కోసం కాదు, కంపెనీల ఓనర్లుగా తయారు కమ్మంటున్నారు.
ఎందుకంటే రేపు ఉద్యోగాలు ఉండకపోవచ్చు!