Business Type3rd Jul 10:52 AMSunil Byrisetty1 min read
మధ్య తరగతికి రిలీఫ్.. జీఎస్టీ పన్ను తగ్గింపు..!
వ్యాట్ స్థానంలో జీఎస్టీ పన్ను విధానాన్ని తీసుకొచ్చిన మోదీ ప్రభుత్వం ఏటా పలు మార్పులు చేస్తోంది. ఈ చర్యలు ప్రభుత్వానికి ఆదాయం పెరగటానికి తోడ్పడుతున్నాయి. ప్రస్తుతం మధ్యతరగతి ప్రజల అ
వ్యాట్ స్థానంలో జీఎస్టీ పన్ను విధానాన్ని తీసుకొచ్చిన మోదీ ప్రభుత్వం ఏటా పలు మార్పులు చేస్తోంది. ఈ చర్యలు ప్రభుత్వానికి ఆదాయం పెరగటానికి తోడ్పడుతున్నాయి. ప్రస్తుతం మధ్యతరగతి ప్రజల అవసరాలకు అనుగుణంగా పన్ను రేట్లలో తగ్గింపును అందించబోతున్నట్లు వెల్లడైంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అనేక వస్తువుల ధరలను అధిక జీఎస్టీ బ్రాకెట్ నుంచి తక్కువ పన్నులకు మార్చాలని కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు వెల్లడైంది. ఈ ఏడాది ప్రారంభంలో ఆదాయపు పన్ను విషయంలో పన్ను రహిత ఆదాయ పరిమితిని న్యూ టాక్స్ రీజిమ్ కింద రూ.12 లక్షలకు పెంచుతూ ఆర్థిక మంత్రిత్వ శాఖ బడ్జెట్లో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం మధ్యతరగతి ప్రజలకు పెద్ద ఉపశమనాన్ని కలిగించింది. ఈ నేపథ్యంలో 12 శాతం కింద ఉన్న అనేక వస్తువులపై పన్నును 5 శాతానికి తగ్గించనున్నట్లు తెలుస్తోంది.