News12th Sep 04:30 PMSunil Byrisetty1 min read

చవితి కానుకగా పాల ధరల పెంపా?

కృష్ణా జిల్లా మిల్క్ యూనియన్ పాల ధరలను వినాయక చవితి రోజు నుండి ( సెప్టెంబర్ 14 తేదీ) లీటర్ కు రెండు రూపాయలు చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పాల ధర పెంపును నిరసిస్తూ విజయవాడలో, వ

చవితి కానుకగా పాల ధరల పెంపా?
కృష్ణా జిల్లా మిల్క్ యూనియన్ పాల ధరలను వినాయక చవితి రోజు నుండి ( సెప్టెంబర్ 14 తేదీ) లీటర్ కు రెండు రూపాయలు చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పాల ధర పెంపును నిరసిస్తూ విజయవాడలో, విజయ డైరీ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సిపిఎం కార్యకర్తలు బ్యానర్లు, ప్లే కార్డులతో ధర్నా జరిపారు. పాల వాహనాలను నిలుపుదల చేశారు. నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న పేద,మధ్యతరగతి ప్రజలను పాల ధర పెంచి కూటమి ప్రభుత్వం మరో దెబ్బ తీయడం దుర్మార్గమన్నారు. లీటర్ కి రెండు రూపాయల చొప్పున పెంచడం వలన తక్షణం 36 కోట్ల భారం, సంవత్సరానికి మూడుసార్లు పెంచడం వలన 100 కోట్ల రూపాయలు పైగా భారం పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. బియ్యం, నూనెలు, పంచదార, ఉల్లిపాయలు వగైరా అన్ని ధరలు పెరిగి ప్రజలు కష్టాల్లో ఉండగా.. ఉపశమనం కలిగించాల్సిన ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరచటం అమానుషమని మండిపడ్డారు. చౌక డిపోల ద్వారా తక్కువ ధరలకు నిత్యవసరాలు అందిస్తామని పాలకులు ఒకవైపును ప్రకటిస్తూ,మరో వైపు ప్రభుత్వమే ధరలను పెంచడం సరికాదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, కూటమి ప్రభుత్వ పెద్దలు స్పందించి పెంచిన పాల ధర పెంపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Andhra Pradesh
Milk Price Hike
Krishna District Milk Union
Vijaya Dairy
CPM Protest
Vijayawada
Vinayaka Chavithi
Milk Prices
Essential Commodity Prices
చంద్రబాబు నాయుడు
కూటమి ప్రభుత్వం
సీపీఎం ఆంధ్రప్రదేశ్
ధరల పెరుగుదల
సామాన్య ప్రజలు
Scroll for the next article