News8th Aug 12:32 PMSunil Byrisetty1 min read
పాల ధర పెంపు.. రోడ్డుపైకి సీపీఎం
విజయ డెయిరీ ఉత్పత్తులైన పాల ధరలు పెరగనున్నాయి. 10వ తేదీ నుంచి పెంచిన ధరలు అమల్లోకి రానున్నాయి. మరోవైపు విశాఖ డెయిరీ, దొడ్ల డెయిరీ, అమూల్ తదితర పాల ఉత్పత్తుల ధరలు పెరిగాయి. విజయ డెయ
విజయ డెయిరీ ఉత్పత్తులైన పాల ధరలు పెరగనున్నాయి. 10వ తేదీ నుంచి పెంచిన ధరలు అమల్లోకి రానున్నాయి. మరోవైపు విశాఖ డెయిరీ, దొడ్ల డెయిరీ, అమూల్ తదితర పాల ఉత్పత్తుల ధరలు పెరిగాయి. విజయ డెయిరీ పాల ధరలను పెంచుతూ కృష్ణా మిల్క్ యూనియన్ నిర్ణయం తీసుకున్నట్లు తె లిసింది. ఏడు రకాల పాలపై లీటరుకు రూ.2 పెంచడంతో పాటు పెరిగిన ధరలను ఈ నెల 10 నుంచి అమలు చేయనున్నట్లు సమాచారం. 9వ తేదీ ఇన్వాయిస్ నుంచి కొత్త ధరల ప్రకారం బిల్లులు జారీ చేస్తారని, పెంపునకు సంబంధించిన ధరల పట్టికల ను ఏజెంట్లకు పంపిణీ చేసినట్లు తెలిసింది. పెంచుతున్న పాల ధరలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో సీపీఎం ఆందోళనకు దిగింది.