News15th Aug 11:30 AMSunil Byrisetty1 min read
లక్షలాది మంది త్యాగం మన స్వాతంత్ర్యం
కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అందరం కలిసి స్వర్ణాంధ్ర సాధనకు ప్రతిన బూనుదామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. విజయవాడ స్టేడియంలో జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వే
కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అందరం కలిసి స్వర్ణాంధ్ర సాధనకు ప్రతిన బూనుదామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. విజయవాడ స్టేడియంలో జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. "ఈ రోజు దేశం అంతా ఒక్కటే పండుగ. కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. అందరూ కలిసి జరుపుకునే ఒకే ఒక్క పండుగ జెండా పండుగ. ఈ రోజు దేశం మొత్తం జాతీయ జెండా గర్వంగా ఎగురుతుంది. ఆ జెండా మనందరి గుండె చప్పుడు. జెండా పండుగ నాకు ఒక పర్సనల్ ఎమోషన్. ఇక్కడ విద్యార్థులను చూసిన తర్వాత నా స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. ఇండిపెండెన్స్ డే వస్తుంది అనగానే స్కూల్ లో హడావుడి ఉండేది. ఫ్రెండ్స్ అంతా కలిసి క్లాస్ రూమ్స్, స్కూల్ ని డెకరేట్ చేసేవాళ్లం. స్కూల్ లో పెట్టే కాంపిటీషన్స్ కోసం స్వాతంత్ర్య సమరయోధుల చరిత్ర గురించి స్టడీ చేసేవాళ్లం. ఫైనల్ గా ఎవరైనా గెస్ట్ వచ్చి జెండా ఎగరేసినప్పుడు గూస్ బంప్స్ వచ్చేవి. జనగణమన అంటూ జాతీయ గీతం పాడుతూ.. జాతీయ జెండా ఎగరడం చూసినప్పుడు చాలా గర్వంగా ఉంటుంది. ఆ మూమెంట్ ఈ రోజు మళ్లీ నాకు గుర్తొచ్చింద"ని వివరించారు.