Telangana29th Aug 01:01 PMSunil Byrisetty1 min read

మజ్లిస్‌లో కలకలం.. ఎమ్మెల్సీ సస్పెండ్!

హైదరాబాద్‌ నగరంలో ప్రధాన పార్టీగా ఉన్న మజ్లిస్ లో కలకలం రేగింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్ సస్పెండ్ కావడం చర్చనీయాంశంగా మారింది. ఆత్తాపూర్ లో ఒక మైనర్ బాలికపై ఎమ్మెల్సీ రహ్మత్

మజ్లిస్‌లో కలకలం.. ఎమ్మెల్సీ సస్పెండ్!
హైదరాబాద్‌ నగరంలో ప్రధాన పార్టీగా ఉన్న మజ్లిస్ లో కలకలం రేగింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్ సస్పెండ్ కావడం చర్చనీయాంశంగా మారింది. ఆత్తాపూర్ లో ఒక మైనర్ బాలికపై ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్ లైంగిక దాడికి పాల్పడి స్థానికులకు రెడ్ హ్యాండ్ గా పట్టు బడటంతోనే సస్పెన్షన్ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. 2023 స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన రహ్మత్ బేగ్ కు 2029 వరకు కాలపరిమితి వుంది. అయినప్పటికీ రెండేళ్ల ముందుగానే ఆయనను మజ్లిస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అంతేకాకుండా వెంటనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా సమర్పించాలని హుకుం జారీ చేసింది. ఈ మేరకు ఎంఐఎం సంయుక్త కార్యదర్శి హుసేన్ అన్వర్ ఒక ప్రకటన విడుదల చేశారు. రహ్మత్ బేగ్ లైంగిక దాడికి పాల్డపి దొరికిపోవడంతో అగ్రహానికి గురైన స్థానిక యువకులు రహ్మత్ బేగ్ ను పట్టుకొని చితకబాదినట్లు సమాచారం. ఈ మొత్తం యవ్వారాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో రహ్మత్ బేగ్ గలీజు పని బయట పడిందని తెలంగాణలో చర్చ జరుగుతోంది.
Telangana News
MIM
AIMIM
Rahmath Beg
Hyderabad
Telangana
MLC Suspended
Sexual Assault Allegations
Minor Girl Case
Crime News
క్రైమ్ న్యూస్
హైదరాబాద్ వార్తలు
తెలంగాణ వార్తలు
రాజకీయ వార్తలు
ఎమ్మెల్సీ వార్తలు
శాంతిభద్రతలు
బ్రేకింగ్
Scroll for the next article