News15th Aug 05:12 PMSunil Byrisetty1 min read
విజయవాడలో మీ మార్ట్ ప్రారంభం
రేషన్ డీలర్ల ఆర్థిక స్వావలంబనను పెంపొందించే లక్ష్యంతో రేషన్ దుకాణాల్లో కూటమి ప్రభుత్వం మినీ మార్టులను ప్రారంభిస్తుంది. విజయవాడ చెరువు సెంటర్లోని కోటా గురునాథం రేషన్ దుకాణంలో ఎమ్మెల
రేషన్ డీలర్ల ఆర్థిక స్వావలంబనను పెంపొందించే లక్ష్యంతో రేషన్ దుకాణాల్లో కూటమి ప్రభుత్వం మినీ మార్టులను ప్రారంభిస్తుంది.
విజయవాడ చెరువు సెంటర్లోని కోటా గురునాథం రేషన్ దుకాణంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ తో కలిసి కలెక్టర్ లక్ష్మీశ మినీ మార్టును ప్రారంభించారు. ప్రజలకు ఒకే చోట నాణ్యమైన నిత్యవసర వస్తువులను అందుబాటు ధరలకు అందించడమే ఈ మార్టుల ప్రధాన ఉద్దేశం అని తెలిపారు. వీటిలో 60 రకాల సరుకులతో ప్రారంభించి, రాబోయే రోజుల్లో 250 రకాల నాణ్యమైన సరుకులను అందించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించిన
ఈ మినీ మార్టులలో
మార్కెట్ ధర కంటే తక్కువ రేట్లకే నాణ్యమైన సరుకులు లభిస్తాయి.