Education28th Jul 05:02 PMSunil Byrisetty1 min read
మినీ ల్యాబ్ లు మీ చెంతకే..
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించి, ప్రయోగాత్మక అభ్యాసాన్ని ప్రోత్సహించేందుకు సైన్స్ ప్రయోగ కిట్లను అందజేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించి, ప్రయోగాత్మక అభ్యాసాన్ని ప్రోత్సహించేందుకు సైన్స్ ప్రయోగ కిట్లను అందజేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. విజయవాడలోని సీవీఆర్ మునిసిపల్ హైస్కూల్‌లో ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలి (ఆప్కాస్ట్) సౌజన్యంతో పాఠశాల విద్యాశాఖ, సమగ్రశిక్ష, లీప్, ఎస్‌సీఈఆర్‌టీ, జెనీ సైన్స్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 100 పాఠశాలలకు సైన్స్ జెనీ బాక్స్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కిట్లను ఉపయోగించడంపై సైన్స్ ఉపాధ్యాయులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాఠశాలల్లో ప్రయోగాత్మక విద్యను అందించేందుకు ల్యాబ్స్ అందుబాటులో ఉన్నాయని.. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను భౌతిక రసాయన జీవశాస్త్రాల అంశాలపై ఆసక్తి,తో ఆవిష్కరణల దిశగా నడిపించేందుకు ఆప్కాస్ట్ సహకారంతో సైన్స్ కిట్లను అందజేయడం జరుగుతోందన్నారు. జెనీ సైన్స్ స్టార్టప్ ను రతన్ టాటా ఇన్నొవేషన్ హబ్ (ఆర్‌టీఐహెచ్) కూడా ప్రోత్సహించినట్లు తెలిపారు. మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, మేకిన్ ఆంధ్రాకు ఈ స్టార్టప్ రూపొందించిన సైన్స్ కిట్లు మంచి ఉదాహరణ అని పేర్కొన్నారు.