Farmers17th Oct 01:17 PMSunil Byrisetty1 min read
శనగ రైతులకు మంత్రి అచ్చెన్న హామీ
శనగ రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. రబీ సీజన్ కి సబ్సిడీపై శనగ విత్తనాలు రైతులకు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్
శనగ రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు.
రబీ సీజన్ కి సబ్సిడీపై శనగ విత్తనాలు రైతులకు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నా రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా వ్యవసాయ శాఖ చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రతి రైతు అవసరాలకు సరిపడే విత్తనాలు అందుబాటులో ఉండేలా ఆదేశాలు జారీ చేశామన్నారు. రైతు ప్రయోజనాలే ప్రభుత్వానికి ప్రాధాన్యమని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.