Farmers17th Nov 01:40 PMSunil Byrisetty1 min read
అన్నదాత సుఖీభవపై మంత్రి అచ్చెన్న సమీక్ష
అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ నిధుల విడుదలపై మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈనెల 19న అన్నదాత సుఖీభవ రెండో విడత నిధుల విడుదలకు సన్నద్ధం అయినట్లు తెలిపారు. రైతుల ఖాతాల్లో కేం
అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ నిధుల విడుదలపై మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈనెల 19న అన్నదాత సుఖీభవ రెండో విడత నిధుల విడుదలకు సన్నద్ధం అయినట్లు తెలిపారు. రైతుల ఖాతాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
రూ.7 వేల జమ చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వాటా కింద రూ.5 వేలు, కేంద్రం వాటా కింద రూ.2 వేలు జమ చేస్తామని చెప్పారు. కడప జిల్లా కమలాపురంలో సీఎం చంద్రబాబు
నిధులు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అన్నదాత సుఖీభవ కింద రెండో విడతలో 46 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని అచ్చెన్న పేర్కొన్నారు.