News6th Nov 02:30 PMSunil Byrisetty1 min read
పత్తి రైతుల ఇబ్బందులపై కేంద్రానికి మంత్రి అచ్చెన్న లేఖ
రాష్ట్రంలోని పత్తి రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చాలని మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు కేంద్ర టెక్స్టైల్ మంత్రి గిరిరాజ్ సింగ్ కి లేఖ రాశారు. 2025–26 ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రవ్యాప్త
రాష్ట్రంలోని పత్తి రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చాలని మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు కేంద్ర టెక్స్టైల్ మంత్రి గిరిరాజ్ సింగ్ కి లేఖ రాశారు. 2025–26 ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 4.56 లక్షల హెక్టార్లలో పత్తి సాగు జరగగా, సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా ఉందని తెలిపారు. అయితే మొంథా తుఫాన్ ప్రభావంతో పత్తి పంట తీవ్రంగా దెబ్బతినడంతో రైతులు కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరలకు పత్తిని విక్రయించాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సీఎం యాప్, ఆధార్ ఆధారిత ఈ-పంట వ్యవస్థ ద్వారా పత్తి కొనుగోళ్లు పూర్తిగా డిజిటలైజ్ చేయబడిన విధానంలో నిర్వహిస్తున్నదని వివరించారు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కాపాస్ కిసాన్ యాప్ ను రాష్ట్ర సీఎం యాప్ తో అనుసంధానం చేసిన తర్వాత కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తి రైతులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. కనుక రైతుల సౌకర్యం కోసం తగు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని మంత్రి అచ్చెన్నాయుడు లేఖలో కోరారు.