News10th Nov 12:56 PMSunil Byrisetty1 min read
పంటల నష్టాలు నమోదు చేయాలి
రాష్ట్రంలో ఇటీవల సంభవించిన ఆర్నాబ్, మురసు తుఫానుల కారణంగా వ్యవసాయ, ఉద్యానవన పంటలకు జరిగిన నష్టాలపై వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్లో స
రాష్ట్రంలో ఇటీవల సంభవించిన ఆర్నాబ్, మురసు తుఫానుల కారణంగా వ్యవసాయ, ఉద్యానవన పంటలకు జరిగిన నష్టాలపై వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్లో సమీక్షించారు. ఆర్నాబ్ తుఫాను ప్రభావంతో 15 జిల్లాల్లో 10,90,933 హెక్టార్ల సాగు విస్తీర్ణానికి గాను 3,27,843 హెక్టార్లలో (30.05%) పంటనష్టం నమోదైందని, 5,23,136 మంది రైతులు ప్రభావితమయ్యారని అధికారులు వివరించారు. 9,78,091 టన్నుల ఉత్పత్తి నష్టంతో రూ.2,392.84 కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని అంచనా వేసినట్లు తెలిపారు. కోనసీమ జిల్లాలో 99.19 శాతం సాగు విస్తీర్ణం దెబ్బతినగా, 94,808 మంది రైతులకు సంబంధించి రూ.348.88 కోట్ల ఆర్థిక నష్టం నమోదైందన్నారు, SDRF కింద రూ.815.57 కోట్లు, NDRF కింద రూ.714.96 కోట్లను అంచనా వేసినట్లు తెలిపారు. మురసు తుఫాను ప్రభావంతో 9 జిల్లాల్లో 5,62,445 హెక్టార్ల సాగు విస్తీర్ణానికి గాను 1,33,351 హెక్టార్లలో (23.71%) పంటలు దెబ్బతిన్నాయని, 1,86,269 మంది రైతులు ప్రభావితమయ్యారని అధికారులు వివరించారు. 3,38,302 టన్నుల ఉత్పత్తి నష్టంతో రూ.816.53 కోట్ల ఆర్థిక నష్టం నమోదైందని అంచనా వేసినట్లు తెలిపారు. SDRF కింద రూ.321.64 కోట్లు, NDRF కింద రూ.266.67 కోట్లను అంచనా వేసినట్లు తెలిపారు. రెండు తుఫానుల వల్ల జరిగిన నష్టాలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి, ఇంకా నమోదు చేయాల్సిన పంటల విస్తీర్ణం, రైతుల సంఖ్యను జిల్లాలవారీగా గుర్తించాలని మంత్రి ఆదేశించారు. ఎన్యూమరేషన్ను త్వరితగతిన పూర్తిచేసి, అర్హులైన ఒక్క రైతు కూడా మిగిలిపోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.