News31st Oct 04:43 PMSunil Byrisetty1 min read
తుఫాన్ అనంతరం పంట నష్టంపై మంత్రి అచ్చెన్న టెలికాన్ఫరెన్స్
మొంథా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వరి పంటలకు నష్టం వాటిల్లిన నేపథ్యంలో, పంట రక్షణ చర్యలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జాయింట్ డైరెక్టర్ల
మొంథా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వరి పంటలకు నష్టం వాటిల్లిన నేపథ్యంలో, పంట రక్షణ చర్యలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జాయింట్ డైరెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతుల కష్టానికి ప్రతిఫలం లభించేలా ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి అచ్చెన్న తెలిపారు. పంట నష్టం తగ్గించేందుకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యవసాయ, హార్టికల్చర్, గ్రౌండ్ వాటర్, మెట్రోలాజికల్ అధికారులతో సమన్వయం కలిగి పనిచేయాలని సూచించారు. ప్రతి మండల వ్యవసాయాధికారి స్థాయిలో పంట నష్టం అంచనాలు ఖచ్చితంగా సేకరించి, రైతులకు తక్షణ ఉపశమనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో శాస్త్రవేత్తల సహాయంతో పంట రక్షణ పద్ధతులు అమలు చేయాలని సూచించారు. రైతుల సమస్యలు, నష్టాలపై అధికారుల నుంచి సమగ్ర నివేదిక అందించాలని, వాటిని త్వరగా ప్రభుత్వానికి సమర్పించి సాయం అందించే దిశగా చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు.