News16th Aug 11:30 AMSunil Byrisetty1 min read
సర్దార్ గౌతు లచ్చన్న సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయి
“స్వాతంత్ర్య సమరయోధుడు, రైతు కాపరి, ప్రజా నాయకుడు సర్దార్ గౌతు లచ్చన్న సేవలు తెలుగు ప్రజలలో చరిత్రగా చిరస్థాయిగా నిలిచిపోతాయని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆయ
“స్వాతంత్ర్య సమరయోధుడు, రైతు కాపరి, ప్రజా నాయకుడు సర్దార్ గౌతు లచ్చన్న సేవలు తెలుగు ప్రజలలో చరిత్రగా చిరస్థాయిగా నిలిచిపోతాయని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆయన కృషి వల్లే రైతులు, కార్మికులు, వెనుకబడిన వర్గాల హక్కులు రక్షింపబడ్డాయి. సామాజిక న్యాయం, సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన లచ్చన్న ఆలోచనలు ఈనాటి తరాలకు మార్గదర్శకాలు. ప్రజాసేవకుడిగా ఆయన చూపిన నిజాయితీ, త్యాగం, ధైర్యం ప్రతి నాయకుడికి ఆదర్శం కావాలి. రాష్ట్ర అభివృద్ధిలో ఆయన కలలు సాకారం చేయడానికి కృషి చేస్తాం. సర్దార్ గౌతు లచ్చన్న గారి 116వ జయంతి సందర్భంగా ఆయనకు నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాన’ని మంత్రి తెలిపారు.