News25th Jul 03:33 PMSunil Byrisetty1 min read

టమాటా ధరలపై తప్పుడు ప్రచారం

టమాటా ధరలపై వాస్తవ పరిస్థితులను తెలుసుకోకుండా రైతులకు కిలోకు కేవలం రూ.2 మాత్రమే లభిస్తోందంటూ వైసిపి తప్పుడు ప్రచారం చేయడం బాధ్యతారాహిత్యమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. రైతుల ప్రయ

టమాటా ధరలపై తప్పుడు ప్రచారం
టమాటా ధరలపై వాస్తవ పరిస్థితులను తెలుసుకోకుండా రైతులకు కిలోకు కేవలం రూ.2 మాత్రమే లభిస్తోందంటూ వైసిపి తప్పుడు ప్రచారం చేయడం బాధ్యతారాహిత్యమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం మార్కెట్ పరిస్థితులను సమీక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతోందని తెలిపారు. వాస్తవాలను వక్రీకరించి రైతులను అయోమయానికి గురిచేసేలా ప్రచారం చేయడం సరికాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో టమాటా సగటు ధర కిలోకు రూ.10.55గా ఉందని, అన్నమయ్య జిల్లాలో రూ.10.58, మదనపల్లె మార్కెట్‌లో రూ.11గా ధర నమోదవుతోందని మంత్రి తెలిపారు. నిన్నటి మార్కెట్ ధరలను పరిశీలిస్తే వివిధ మార్కెట్లలో కనిష్టంగా రూ.6 నుంచి గరిష్టంగా రూ.16 వరకు ధరలు ఉన్నాయని వివరించారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా టమాటా రైతులకు కిలోకు కేవలం రూ.2 మాత్రమే లభిస్తోందని చెప్పడం వాస్తవ విరుద్ధమని అన్నారు.
Andhra Pradesh
AP Government
Tomato Prices
Achchennaidu
Tomato Farmers
మదనపల్లె మార్కెట్
అన్నమయ్య జిల్లా
మార్కెట్ ధరలు
టమాటా మార్కెట్
రైతు సమస్యలు
Scroll for the next article