News9th Dec 11:59 AMSunil Byrisetty1 min read
మిర్చి తెగుళ్లపై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరా
రాష్ట్రంలో మిర్చి పంటను ఆశిస్తున్న తెగుళ్లపై వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరా తీశారు. ఉద్యానవన శాఖ డైరెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. పరిస్థి
రాష్ట్రంలో మిర్చి పంటను ఆశిస్తున్న తెగుళ్లపై వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరా తీశారు. ఉద్యానవన శాఖ డైరెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. పరిస్థితిపై తక్షణ నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులకు నష్టం జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతులకు ప్రత్యక్షంగా సూచనలు, సలహాలు అందచేయాలని అధికారులకు మంత్రి అచ్చెన్న సూచించారు. నివారణ చర్యలు, రైతులకు అవగాహన కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు మంత్రికి హర్టికల్చర్ డైరెక్టర్ డా.కే.శ్రీనివాసులు వివరించారు. నల్ల తామర పురుగు నివారణకు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు అమలుచేయాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు.