Politics1st Aug 04:43 PMSunil Byrisetty1 min read

జగ‌న్ కు మ‌తిభ్ర‌మించిందన్న మంత్రి

ఐదేళ్లు రాష్ట్రాన్ని ప‌రిపాలించ‌డం చేత‌కాక, 2024 లో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ పార్టీ ఘోరంగా ఓట‌మి చెంద‌టం వ‌ల‌న ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ రెడ్డికి మ‌తి భ్ర‌మించింద‌ని వ్య

జగ‌న్ కు మ‌తిభ్ర‌మించిందన్న మంత్రి
ఐదేళ్లు రాష్ట్రాన్ని ప‌రిపాలించ‌డం చేత‌కాక, 2024 లో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ పార్టీ ఘోరంగా ఓట‌మి చెంద‌టం వ‌ల‌న ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ రెడ్డికి మ‌తి భ్ర‌మించింద‌ని వ్య‌వ‌సాయ శాఖ మ‌త్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. కూట‌మి ప్ర‌భుత్వం అభివృద్ధి, సంక్షేమం స‌మపాళ్ల‌లో రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అందిస్తూ ఉంటుంటే జ‌గ‌న్ త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్నాడ‌ని మండిప‌డ్డారు. ప్రజల ఆస్తులను లూటీ చేసి, వేల కోట్లు దోచుకున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తన అసలైన రూపాన్ని మరోసారి బయటపెట్టారని అన్నారు. రాష్ట్ర మంత్రుల ఇళ్లపై దాడులు చేయండి అనే పిలుపు ఇచ్చిన జగన్ హ‌త్యా రాజకీయాలకే ప్రాతినిధ్యం వహిస్తున్నాడని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలు, యువ‌తీ యువ‌కులు, వ్యాపారవేత్తలు అన్ని వర్గాల ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి తన ఉనికి కోసం పరామర్శల పేరుతో తిరుగుతూ రాష్ట్రంలో అలజడి సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు.
Andhra Pradesh Politics
Achchennaidu
Jagan Mohan Reddy
YSRCP Defeat 2024
Political Allegations
State Ministers
Violence Allegations
Public Welfare
ఆంధ్రప్రదేశ్ రాజకీయం
రాజకీయ ఆరోపణలు
Scroll for the next article