Politics19th Jun 04:09 PMSunil Byrisetty1 min read
జగన్‌కు మంచి సలహా ఇచ్చిన మంత్రి అనగాని
పులివెందుల శాసనసభ్యుడు జగన్ రెడ్డి మానసిక పరిస్థితి సరిగా లేదని, ఆయన గంజాయి బ్యాచ్, ఉన్మాదులు, బెట్టింగులకు పాల్పడే నేరగాళ్లతో సమావేశమవుతున్నారని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్ర
పులివెందుల శాసనసభ్యుడు జగన్ రెడ్డి మానసిక పరిస్థితి సరిగా లేదని, ఆయన గంజాయి బ్యాచ్, ఉన్మాదులు, బెట్టింగులకు పాల్పడే నేరగాళ్లతో సమావేశమవుతున్నారని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 'యోగాంధ్ర' కార్యక్రమంలో పాల్గొంటే జగన్ రెడ్డిలో ఉన్న ఫ్రస్ట్రేషన్ కొంతైనా తగ్గుతుందని ఆయన హితవు పలికారు. అల్లర్లు సృష్టించడం మానుకుని యోగాసనాలు వేస్తే మానసిక పరిస్థితి మెరుగుపడుతుందని మంత్రి సూచించారు. ఫ్రస్ట్రేషన్‌లో జగన్ రెడ్డి ఏది పడితే అది మాట్లాడుతున్నారని, "చంపేస్తాం, నరికేస్తాం" అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్న వైసీపీలోని కొందరు సైకోల చేష్టలను వ్యతిరేకించాల్సింది పోయి, చిరునవ్వుతో స్వాగతిస్తున్నారని అనగాని ఆరోపించారు. ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రిలో ఉండే రోగులకు ఉండే లక్షణాలన్నీ జగన్‌లో కనిపిస్తున్నాయని అనగాని సత్యప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పుతో జగన్ రెడ్డి మానసిక స్థితి దెబ్బతిన్నదని ఆయన అభిప్రాయపడ్డారు.