Politics2nd Nov 11:51 AMSunil Byrisetty1 min read
జోగి పాపం పండింది
జోగి రమేష్ నకిలీ మద్యం తయారు చేయించి బెల్టు షాపులు, ప్రభుత్వ షాపుల్లో అమ్మించారని మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. అగ్రిగోల్డ్ భూములు కబ్జా చేశారన్నారు. నకిలీ మద్యం సూత్ర
జోగి రమేష్ నకిలీ మద్యం తయారు చేయించి బెల్టు షాపులు, ప్రభుత్వ షాపుల్లో అమ్మించారని మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. అగ్రిగోల్డ్ భూములు కబ్జా చేశారన్నారు. నకిలీ మద్యం సూత్రధారి జోగి రమేష్.. పాత్రధారి అద్దేపల్లి జనార్థన్ రావు ముఠా అని ఆరోపించారు. జనార్థనరావు ఆఫ్రికాకు జంప్ అయ్యే ముందు జోగి రమేష్ ఇంటికి ఎందుకు వెళ్లారని? జోగిరమేష్ ఇంటికి అద్దేపల్లి జనార్థనరావు వెళ్లినట్టు సీసీ టీవీ పుటేజ్ రుజువు నిజనిర్ధారణకు బలమైన ఆధారం కాదా అని నిలదీశారు. న్యాయస్థానాల్లో సీసీ టీవీ పుటేజ్ కు విలువ వుంటుందిగాని జోగి రమేష్ ప్రమాణాలు, ఒట్టుకు, సవాళ్లకు విలువ ఉండదనేది జగమెరిగిన సత్యమని చెప్పారు. జోగి రమేష్ ప్రలోభాలతోనే 2022 నుండి నకిలీమద్యం తయారీని ప్రారంభించానని అద్దేపల్లి వాంగ్మూలం ఇచ్చింది నిజం కాదా అని, అతనికి రూ. 3 కోట్లు ఆశ పెట్టింది నిజం కాదా అని ప్రశ్నించారు. జగన్ ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. జయచంద్రారెడ్డిని తెలుగు దేశం నుంచి సస్పెండ్ చేసి చంద్రబాబు ప్రభుత్వం కేసు నమోదు చేసిందని గుర్తు చేశారు.