Politics6th Dec 01:53 PMSunil Byrisetty1 min read

పరకామణి చోరీ జగన్‌కు చిన్న అంశమా?: మంత్రి ఆనం

పరకామణి చోరీ జగన్‌కు చిన్న అంశమైతే.. తన దృష్టి లో పెద్ద దోపిడీ ఏంటో కూడా జగనే చెప్పాలని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రశ్నించారు. చిన్న వ్యవహారం అంటూ జగన్ టీటీడీని తక్కు

పరకామణి చోరీ జగన్‌కు చిన్న అంశమా?: మంత్రి ఆనం
పరకామణి చోరీ జగన్‌కు చిన్న అంశమైతే.. తన దృష్టి లో పెద్ద దోపిడీ ఏంటో కూడా జగనే చెప్పాలని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రశ్నించారు. చిన్న వ్యవహారం అంటూ జగన్ టీటీడీని తక్కువ చేసి మాట్లాడి భక్తుల విశ్వాసాలతో ఆటలాడుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. 70 వేలు దొంగతనం చేసిన వ్యక్తికి.. రాజీ కోసం రాసిన కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయని నిలదీశారు. జగన్ పాలన లో నిరంతర ప్రక్రియగా సాగిన పరకామణి చోరీలో ఒక రోజు సీసీ కెమెరాల్లో మాత్రమే ఆ దొంగ దొరికాడని స్పష్టం చేశారు. పాల చుక్క లేకుండా జగన్ పాలనలో తిరుమల ప్రసాదానికి నెయ్యి కనిపెట్టడం ప్రపంచానికే పెద్ద వింతన్నారు. దొంగ చేతికి తాళాలు ఇస్తే ఏమవుతుందో జగన్ 5ఏళ్ల పాలనలో ప్రజలు చూశారని వ్యాఖ్యానించారు. 5 ఏళ్ల మాఫియా సామ్రాజ్యాన్ని ప్రజలు ఇంకా మర్చిపోక ముందే టీటీడీపై జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు దుర్మార్గమని మంత్రి ఆనం మండిపడ్డారు.
Andhra Pradesh politics
Anam Ramanarayana Reddy
Jagan comments
TTD controversy
Tirumala treasury theft
దేవదాయ శాఖ
వైఎస్సార్‌సీపీ
టీడీపీ విమర్శలు
భక్తుల విశ్వాసం
Scroll for the next article