News15th May 01:51 PMSunil Byrisetty1 min read

గ్రీవెన్స్‌లో ఫిర్యాదులు స్వీకరించిన మంత్రి ఆనం

తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున "గ్రీవెన్స్ కార్యక్రమం"లో భాగంగా, మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన వినత

గ్రీవెన్స్‌లో ఫిర్యాదులు స్వీకరించిన మంత్రి ఆనం
తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున "గ్రీవెన్స్ కార్యక్రమం"లో భాగంగా, మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వయంగా స్వీకరిస్తున్నారు. ప్రజల నుంచి స్వీకరించిన వినతులపై సమస్యలు పరిష్కారం దిశగా అక్కడక్కడే అధికారులతో మాట్లాడుతున్నారు. గ్రీవెన్స్ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తో పాటు ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ కూడా పాల్గొన్నారు. ప్రజాసంక్షేమం, ప్రజల ఫిర్యాదుల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు.
Mangalgiri
TDP Office
grievance redressal program
Minister Anam Rama Narayana Reddy
గ్రీవెన్స్ కార్యక్రమం
కార్పొరేషన్ ఛైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ
Scroll for the next article