News3rd May 04:44 PMSunil Byrisetty1 min read
పెంచలకోన బ్రహ్మోత్సవాలకు సామాన్య భక్తులకు పెద్దపీట
పెంచలకోనలో బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడారు. సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించి అధికారులకు, ఫెస్టివల్
పెంచలకోనలో బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడారు.
సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించి అధికారులకు, ఫెస్టివల్ కమిటీ సభ్యులకు సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలని దిశా నిర్దేశం చేశారు. ఈనెల 8 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమన్వయంతో పని చేయాలన్నారు.
గతంలో లేని విధంగా ఈ బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ, కళ్యాణోత్సవం రోజున కళ్యాణోత్సవం రోజుల్లో భక్తులకు ఉచితంగా స్వామివారి లడ్డూ ప్రసాదం పంపిణీకి శ్రీకారం చుడుతున్నామన్నారు.
వేసవి దృష్ట్యా భక్తులకు ఇబ్బంది లేకుండా క్యూలైన్లలో వాటర్ బాటిల్స్, మజ్జిగ, చంటి బిడ్డలకు పాలు బిస్కెట్లు అందించాలని సూచించారు.
భద్రత దృష్ట్యా సీసీ కెమెరాలు, హెడ్ కౌంటు మిషన్, 24 గంటలు పని చేసేలా కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.